: హైదరాబాద్ చేరుకున్న జగన్.. కాసేపట్లో మీడియా సమావేశం
విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోనే బైఠాయించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని పోలీసులు బలవంతంగా హైదరాబాద్ విమానం ఎక్కించిన విషయం తెలిసిందే. ఆయన విశాఖపట్నం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. విశాఖలో జరిగిన పరిణామాలపై జగన్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఏపీలోని పలు ప్రాంతాల్లో క్యాండిల్ ర్యాలీలు కొనసాగుతున్నాయి. 'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు' అని నినదిస్తున్నారు.