: రెండు సార్లు బౌల్డ్ చేసినా... నిరాశ చెందిన బుమ్రా!


ఎవరైనా బౌలర్ రెండు వరుస బంతుల్లో రెండు సార్లు ఒక ఆటగాడిని క్లీన్ బౌల్డ్ చేసినా ఆ ఆటగాడు అవుట్ కాలేదంటే ఎలా ఉంటుందో టీమిండియా పేసర్ జస్ ప్రీత్ బుమ్రాను అడగాలి. ఎందుకంటే, ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి టీ20లో 17వ ఓవర్ బౌలింగ్ చేసిన బుమ్రా ఐదో బంతికి జో రూట్ ను బౌల్డ్ చేశాడు. అంతే.. టీమిండియా శిబిరంలో ఆనందం పెల్లుబికింది. అప్పటికే టీమిండియా ఓటమి ఖరారైపోయింది. దాంతో, టీమిండియా ఆటగాళ్లంతా బుమ్రాను అభినందించారు. మ్యాచ్ టర్న్ అయిందని అంతా భావించారు. అయితే, అంపైర్ దానిని రివ్యూ కోరడంతో థర్డ్ అంపైర్ దానిని తరచి చూసి, నోబాల్ గా ప్రకటించారు. దీంతో అవుట్ సంగతటుంచి, ఫ్రీ హిట్ వచ్చింది. దీంతో తరువాత బంతిని యార్కర్ గా సంధించిన బుమ్రా మళ్లీ రూట్ ను బౌల్డ్ చేశాడు. ఇలా వరుస రెండు బంతుల్లో రెండు సార్లు అవుట్ చేసినా రూట్ అవుట్ కాకపోవడంతో బుమ్రా నిరాశపడ్డాడు. 

  • Loading...

More Telugu News