: జగన్‌ను బలవంతంగా హైదరాబాద్ విమానం ఎక్కించిన పోలీసులు!
విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోనే బైఠాయించిన వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డితో పాటు ఇతర వైసీపీ నేతలను అక్కడి పోలీసులు హైదరాబాద్ విమానం ఎక్కించారు. జగన్ హైదరాబాద్‌కు వెళ్లేందుకు నిరాకరించడంతో పోలీసులు ఆయనను బలవంతంగా తరలించారు. దీంతో సుమారు రెండు గంటపాలు విశాఖ ఎయిర్‌పోర్టులో కొనసాగిన ఉత్కంఠ ముగిసింది. మరికాసేపట్లో జగన్ తో పాటు ఆయన టీమ్ హైదరాబాద్ చేరుకోనున్నారు. అనంతరం వారు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.