: ఐసిస్ కు మద్దతుగా పోలీసును కత్తితో పొడిచిన జర్మన్ బాలిక!
ఐఎస్ఐఎస్ పై అభిమానంతో ఓ పోలీసును బాలిక కత్తితో పొడిచిన ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జర్మనీలోని హనోవర్ ప్రాంతానికి చెందిన సఫియా ఎస్ (16) అనే బాలిక ఐఎస్ఐఎస్ పై అభిమానం పెంచుకుంది. ఈ క్రమంలో ఆ ఉగ్రసంస్థ భావజాలానికి ప్రభావితమైన సఫియా ఒక పోలీసును కత్తితో పోడిచి చంపే ప్రయత్నం చేసింది. అయితే తీవ్రగాయాలైన ఆ పోలీసు బతుకుజీవుడా అంటూ ఆసుపత్రిలో చేరాడు. ఈ సందర్భంగా పట్టుబడ్డ ఆమెను పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరచగా, ఐఎస్ఐఎస్ కు మద్దతుగా ఆ పని చేసినట్టు తెలిపింది. కాగా, ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష పడింది.