: వచ్చిన ఫ్లైట్ లోనే వెళ్లమన్న పోలీసులు... ససేమిరా అన్న జగన్!
వైఎస్సార్సీపీ అధినేత జగన్ వైజాగ్ చేరడం వెనుక హైడ్రామా నడిచింది. వాస్తవానికి జగన్ ను వైజాగ్ వెళ్లకుండా అడ్డుకునేందుకు ఏపీ పోలీసులు అన్ని ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రధాన ప్రతిపక్ష నేతగా తనకున్న విశేష అధికారాలతో జగన్ హైదరాబాదు ఎయిర్ పోర్టు నుంచి విశాఖపట్టణం ఎయర్ పోర్టుకు చేరుకున్నారు. తమకు వచ్చిన ఆదేశాలు, ఇచ్చిన అధికారాలతో ఏపీ పోలీసులు జగన్ విమానం దిగగానే పోలీసు వ్యాన్ ఎక్కాలని ఒత్తిడి చేశారు.
కనీసం లాంజ్ లోకి అనుమతించాలన్నా వారు అనుమతించలేదు. అంతే కాకుండా వచ్చిన ఫ్లైట్ లోనే వెనుదిరగాలని పోలీసులు సూచించారు. దీంతో జగన్ రన్ వేపైనే బైఠాయించారు. ఆ విమానం తిరిగి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు ఆయన రన్ వే నుంచి లేచి విమానం టేకాఫ్ అయ్యేందుకు సహకరించారు. అయితే ఆయనను ఎలాగైనా హైదరాబాదు తిప్పిపంపాలని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆరు గంటలకు ఉన్న విమానం లేదా, రాత్రి 8 గంటలకు ఉన్న విమానంలో ఆయనను వెనక్కి పంపే అవకాశం కనిపిస్తోంది.