: విమానం దిగగానే, వ్యాన్ ఎక్కాలంటూ అడ్డుకున్నారు: అంబటి రాంబాబు
విశాఖపట్నంలో తాము విమానం దిగగానే తమను పోలీసులు అడ్డుకున్నారని... వ్యాన్ లోకి ఎక్కాలని చెప్పారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వారంతా మఫ్టీలో ఉన్నారని... వారు పోలీసులో, గూండాలో తెలియడం లేదని తెలిపారు. ఒకవేళ వారు నిజమైన పోలీసులే అయినా... వాళ్లు రన్ వే మీదకు రావడం తప్పని అన్నారు. తమను ప్రయాణికుల లాంజ్ వరకు కూడా వెళ్లనివ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉందని... తమపై ప్రివెంటివ్ ఆర్డర్లు ఉన్నాయని చెబుతున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం నిర్వహించనున్న కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు అంబటి రాంబాబు, విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు వైజాగ్ వెళ్లారు.