: జగన్! నేను రెడీ.. మీరు రెడీనా?: అచ్చెన్నాయుడు
బుద్ధి, జ్ఞానం ఉన్నవారు రిపబ్లిక్ దినోత్సవం నాడు నిరసనలు చేయరంటూ వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. విశాఖలో జరగనున్న ఇండస్ట్రియల్ సమ్మిట్ ను ఎదుర్కోవడమే జగన్ లక్ష్యమని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి జగన్ అడుగడుగునా అడ్డు పడుతున్నారని అన్నారు. ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జగన్ కు సూచించారు. ప్రత్యేక హోదా లేకపోయినా... రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను చంద్రబాబు తీసుకువస్తున్నారని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలనేదే తమ డిమాండ్ అని చెప్పారు. జగన్ మిలాఖత్ రాజకీయాల వల్ల ఏపీ అడుక్కునే స్థితికి వచ్చిందని మండిపడ్డారు. ప్రత్యేకహోదాపై బహిరంగ చర్చ కోసం ప్రభుత్వ ప్రతినిధిగా తాను వస్తానని... చర్చకు తమరు సిద్ధమా? అంటూ జగన్ కు సవాల్ విసిరారు.