: సోకులతో విదేశాలు తిరిగే కల్వకుంట్ల కవిత.. : మధు యాష్కీ తీవ్ర వ్యాఖ్యలు
టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోకులతో విదేశాలు తిరుగుతున్న కవితకు... తెలంగాణ విద్యార్థుల శోకాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం మొత్తం తెలంగాణ ఆస్తులను కొల్లగొడుతోందని మండిపడ్డారు. నవంబర్ 18వ తేదీన ప్రధాని మోదీ కాళ్లను కేసీఆర్ పట్టుకోలేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంపై ఈ మధ్య కాలంలో మధు యాష్కీ పలుమార్లు విమర్శలు గుప్పించారు.