: హైదరాబాద్ లో బెట్టింగ్ రాకెట్ గుట్టురట్టు


ఐపీఎల్ టోర్నీ క్రికెట్ అభిమానులనే కాదు బెట్టింగ్ రాయుళ్ళనూ బాగానే అలరిస్తోన్నట్టుంది! లీగ్ ప్రారంభమైందో లేదో బెట్టింగ్ ముఠాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు చోట్ల ఈ ముఠాలు పోలీసుల చేత చిక్కాయి. తాజాగా హైదరాబాద్ లోనూ ఓ ముఠా గుట్టు రట్టయింది. నగరంలోని కేపీహెచ్ బీ కాలనీలో బెట్టింగ్ కు పాల్పడుతున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద నుంచి రూ. 6 లక్షల నగదు, మూడు ల్యాప్ టాప్ లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News