: లడ్డూలు అమ్మే వారిపై కాదు.. పాచి లడ్డూలు పెట్టిన వారిపైనే మా అసహనం: పవన్ కల్యాణ్
ప్రత్యేక హోదా నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో ట్వీట్ వదిలారు. తమకు లడ్డూల మీద కాని, వాటిని తినేవారి మీద కాని, వాటిని అమ్మేవారి మీద కాని చులకన భావం లేదని ఆయన తెలిపారు. కానీ, అడక్కుండానే పాచిపోయిన లడ్డూలను చేతిలో పెట్టినవారి మీదే తమ అసహనం అని చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించాలని జనసేన పార్టీ కోరుకుంటోందని ట్వీట్ చేశారు.
#APDemandsSpecialStatus #staleladdoos #JanaSena #jallikattu #BattleofAndhras pic.twitter.com/2qw0knXCdl
— Pawan Kalyan (@PawanKalyan) January 26, 2017