: తక్షణం గోడ నిర్మాణం... సంతకం పెట్టిన ట్రంప్!


మెక్సికో సరిహద్దుల్లో తక్షణం గోడను నిర్మించేందుకు నిర్ణయిస్తూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో ఇమిగ్రేషన్ విభాగంలో ఉద్యోగుల సంఖ్యను మరింతగా పెంచాలన్న ఫైల్ పై కూడా సంతకం చేశారు. అమెరికాలో చట్ట వ్యతిరేకంగా, అనుమతులు లేకుండా దాదాపు 1.1 కోట్ల మంది నివాసం ఉంటున్నారని, వారందరినీ గుర్తించి చర్యలు చేపట్టేందుకు వచ్చే వారంలో ఇంకా కీలక నిర్ణయాలు తీసుకోనున్నామని ట్రంప్ సర్కారు ఈ సందర్భంగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులను గుర్తించి, వారిని నిర్బంధించి ఉంచేందుకు మరిన్ని డిటెన్షన్ కేంద్రాల ఏర్పాటు, ఫెడరల్ బార్డర్ కంట్రోల్ ఏజంట్ల నియామకం, ఫెడరల్ ఇమిగ్రేషన్ చట్టాల అమలుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి వుందనిపేర్కొంది. ఈ ఆదేశాలు జారీ చేసిన తరువాత డీహెచ్ఎస్ ఉద్యోగులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. అమెరికాలో వలస చట్టాన్ని మరింత కఠినం చేయనున్నామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కాగా, తాను అధికారంలోకి వస్తే, సరిహద్దుల్లో బలమైన గోడ కడతానని ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News