: వైజాగ్ వైఎంసీఏ వద్ద రోడ్డెక్కిన యువత, ఆడ్డుకున్న పోలీసులు... ఉద్రిక్తత
విశాఖలో యువత రోడ్డెక్కింది. అనుకున్నట్టుగానే ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగిన యువతీ యువకులను పోలీసులు అడ్డుకున్నారు. వైఎంసీఏ వద్ద రహదారిపై మౌన ప్రదర్శనకు దిగిన విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడంతో ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఆర్కే బీచ్ వేదికగా భారీ సంఖ్యలో యువత ప్రదర్శనలకు దిగవచ్చన్న అనుమానంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. బీచ్ రోడ్డులో నివసించే వారిని సైతం ఆపి ప్రశ్నిస్తున్నారు. గుర్తింపు కార్డులు ఉంటేనే వారిని ఇళ్లల్లోకి పంపుతుండటంతో, పలు చోట్ల మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది.