: బికినీ షోలకైతే ప్రభుత్వం అనుమతిస్తుందా?: రోజా
రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం యువత చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. బీచ్ లలో బికినీ షోలకైతే అనుమతిస్తారా? అంటూ విమర్శించారు. శాంతియుతంగా నిర్వహించుకునే కార్యక్రమానికి ఎందుకు మద్దతు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా వల్లే రాష్ట్ర యువతకు భవిష్యత్తు ఉంటుందని... దానికోసం పోరాడుతున్న యువతను అణగదొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రదేశాల్లో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున హాజరై సంఘీభావం తెలపాలని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటే, ప్రభుత్వం గడ్డు పరిస్థితిని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.