: జగన్, పవన్ ఎవరైనా సరే రండి... సవాల్: గంటా శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పత్యేక ప్యాకేజీతో కలిగే లాభాలపై వైకాపా అధినేత వైఎస్ జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లలో ఎవరైనా సరే బహిరంగ చర్చకు రావాలని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ సవాల్ విసిరారు. ఈ ఉదయం విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిధి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత సంవత్సరం జరిగిన సదస్సు తరువాత వచ్చిన పెట్టుబడులపై కూడా బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఎవరైనా చర్చకు హాజరు కావచ్చని తెలిపారు. విశాఖలో రెండు రోజుల పెట్టుబడుల సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. సదస్సుకు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు హాజరవుతారని తెలిపారు. 50 దేశాల నుంచి 2 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారని, సదస్సును అభాసుపాలు చేసేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నాయని ఆరోపించారు. ఆంధ్రా యువత పేరిట జగన్, పవన్ లు ర్యాలీలు చేయడం తగదని హితవు పలికారు.