: లెస్ వాయిస్.. మోర్ సౌండ్: హోదాకు మద్దతు పలికిన హీరో రామ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం మద్దతిస్తున్న సినీ హీరోల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలో యంగ్ హీరో రామ్ చేరాడు. ఈ రోజు విశాఖపట్నంలో జరగనున్న మౌన పోరాటానికి మద్దతు పలికాడు. "మిత్రులారా, అడగటం లేదు. అడుక్కోవడం లేదు. ఎదురు చూస్తున్నాం. లెస్ వాయిస్.. మోర్ సౌండ్" అని ట్వీట్ చేశాడు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి సాయి ధరమ్ తేజ్, మనోజ్, రాజమౌళి, వరుణ్ తేజ్ తదితరులు ప్రత్యేక హోదా కోసం చేయనున్న నిరసనకు మద్దతు పలికారు.
Dear Brothers & Sisters..ADAGATLEDHU..ADUKOVATLEDHU...EDHURUCHUSTUNAAM..Less NOISE = More SOUND !! #silentprotest #APDemandsSpecialStatus pic.twitter.com/xs9BI1DmO7
— Ram Pothineni (@ramsayz) January 25, 2017