: వెళ్లి కోడి పందేలు, పందుల పందేలు ఆడుకోండి: సుజనా చౌదరి


జల్లికట్టు స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం ఉద్యమిద్దామంటూ పలువురు చేస్తున్న వ్యాఖ్యల పట్ల కేంద్ర మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టు స్ఫూర్తి కావాలంటే... వెళ్లి కోడి పందేలు, పందుల పందేలు ఆడుకోవాలని సూచించారు. రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరిగినా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఊరుకోరని చెప్పారు. ఏ సెక్షన్ కింద, ఏ రూల్ కింద అన్యాయం జరిగిందో చెబితే, దానికి సమాధానం చెబుతానని తెలిపారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని చెప్పారు. కొంతమంది అనవసరంగా విద్యార్థులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని భావిస్తున్నారని మండిపడ్డారు. 

  • Loading...

More Telugu News