: పవన్ కల్యాణ్ కు ఉన్నంత శ్రద్ధ మహేష్ బాబుకు ఉన్నట్టు లేదు!: రాంగోపాల్ వర్మ విమర్శలు


నిత్యమూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచివుండే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబును టార్గెట్ చేసుకున్నాడు. ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్, మహేశ్ బాబుల తీరును పోలుస్తూ, మహేష్ సరిగ్గా స్పందించడం లేదని అభిప్రాయపడ్డాడు. రాష్ట్ర ప్రజలంటే పవన్ కల్యాణ్ కు ఉన్నంత శ్రద్ధ మహేష్ బాబుకు ఉన్నట్టు లేదని అన్నాడు. డబ్బింగ్ మార్కెట్ అంటే మహేష్ బాబుకు ఇష్టంగా ఉందని, తనను సూపర్ స్టార్ చేసిన ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నాడు. ఈ విషయం తనకు దిగ్భ్రాంతిని కలిగిస్తోందని అన్నాడు. ఏపీ సమస్యలను వదిలేసి తమిళ సంస్కృతికి మద్దతివ్వడం ఏంటని ప్రశ్నించాడు.

  • Loading...

More Telugu News