: తిరుపతిలో పట్టాలు తప్పిన రాయలసీమ ఎక్స్ ప్రెస్


హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య ప్రయాణించే రాయలసీమ ఎక్స్ ప్రెస్ ఈ ఉదయం తిరుపతి రైల్వే స్టేషన్ లో పట్టాలు తప్పింది. ఉదయం తిరుపతికి వచ్చిన తరువాత మరమ్మతులు చేసేందుకు తీసుకువెళుతుండగా, ఓ బోగీ పట్టాలు తప్పింది. ఆ సమయంలో రైల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పినట్లయింది. విషయం తెలుసుకున్న అధికారులు ప్రమాదం ఎలా జరిగిందో ఆరా తీస్తున్నారు. కాగా, నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి, ఈ ఉదయం 8 గంటల సమయంలో రాయలసీమ ఎక్స్ ప్రెస్ తిరుపతికి చేరింది. ఆపై నిర్వహణా పనుల్లో భాగంగా యార్డుకు తరలిస్తుంటే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News