: నేడు కోస్తాకు వర్ష సూచన.. చిరు జల్లులు కురిసే అవకాశం
నేడు కోస్తాంధ్రలో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంపైకి వస్తున్న తూర్పు గాలుల కారణంగా నేడు(గురువారం) కోసాంధ్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు గాలుల ప్రభావంతో ఆకాశంలో దట్టమైన మేఘాలు ఏర్పడతాయని పేర్కొంది. ఆకాశం ఈ రోజంతా మేఘావృతమై ఉంటుందని తెలిపింది.