: టీ20 సిరీస్ లో ఆ ఏడుగురిపైనే అందరిచూపు!
ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య రేపటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. టెస్టు, వన్డే సిరీస్ లను గెలుచుకున్న భారత జట్టు టీ20 సిరీస్ ను కూడా గెలుచుకుంటుందా? లేక చివరి వన్డేలో విజయంతో ఫాంలోకి వచ్చిన ఇంగ్లండ్ జట్టు సిరీస్ గెలుచుకుని పరువు కాపాడుకుంటుందా? అన్నది అందర్లోనూ ఆసక్తి రేపుతున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో భారత జట్టు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో జట్టులోకి నలుగురు బౌలర్లు రానున్నారు. సీనియర్ బౌలర్లు ఆశిష్ నెహ్రా, అమిత్ మిశ్రా లతో పాటు, రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో పర్వేజ్ రసూల్, జడేజా స్థానంలో యజువేంద్ర చాహల్ లు రాగా, భారత భవిష్యత్ కీపర్ బ్యాట్స్ మన్ అంటూ ప్రశంసలందుకుంటున్న రిషబ్ పంత్, మన్ దీప్ సింగ్ లపై జట్టు అందరి చూపు నిలిచిఉంది. ప్రధానంగా సురేష్ రైనా ఆటతీరు విజయాలతో పాటు, జట్టులో అతని స్థానాన్ని తేల్చిచెప్పనున్నాయి. దీంతో టీ20 సిరీస్ భారత్ లోని అందర్లో ఆసక్తి రేపుతోంది.