: కతియార్ క్షమాపణలు చెప్పి తీరాల్సిందే: ప్రియాంక భర్త వాద్రా
యూపీ ఎన్నికలకు ప్రియాంకా గాంధీని స్టార్ క్యాంపెయినర్ గా తాను భావించడం లేదని, ఆమె కన్నా అందమైన మహిళలు ఎందరో ఉన్నారంటూ బీజేపీ సీనియర్ నేత వినయ్ కతియార్ వ్యాఖ్యలు చేయడం విదితమే. ఈ వ్యాఖ్యలపై ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా మండిపడుతున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా ఆయన స్పందించారు. మహిళలను ప్రతిఒక్కరూ గౌరవించాలని, వారికి సమాన గౌరవం ఇవ్వాలని పేర్కొన్న వాద్రా, ప్రియాంకపై చేసిన వ్యాఖ్యలకు కతియార్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. కాగా, ఈ విషయమై కతియార్ ను మీడియా ప్రశ్నించగా, ఈ వ్యవహారంపై తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.