: కొత్త పాత్రలో కెప్టెన్ కోహ్లీ


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త బాధ్యతలు తలకెత్తుకోనున్నాడు. గతంలో 3వ నెంబర్ బ్యాట్స్ మన్ గా బరిలో దిగిన కోహ్లీ జట్టులో స్థిరంగా స్థానం సంపాదించుకున్నాడు. దిగ్గజాలు రిటైర్ కావడానికి తోడు, టాప్ ఆర్డర్ లో సంభవించిన మార్పులు, స్థిరంగా రాణించడంతో కోహ్లీకి ప్రమోషన్ వచ్చింది. ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగుతున్నాడు. దీంతో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఈమధ్య కాలంలో టీమిండియా టెయిల్ ఎండర్లు, మిడిల్ ఆర్డర్ ఆకట్టుకుంటోంది. టాపార్డర్ కూడా సత్తాచాటుతోంది. అయితే ఓపెనర్లు మాత్రం విఫలమవుతున్నారు.

 క్రీజులో నిలదొక్కుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇంగ్లండ్ తో జరగనున్న టీ20 సిరీస్ లో తాను ఓపెనర్ గా వచ్చే అవకాశం ఉందని కోహ్లీ సంకేతాలిచ్చాడు. నిలకడలేనప్పుడే సమస్యలు వస్తాయని, అవసరమైతే తాను ఓపెనర్ గా వస్తానని చెప్పాడు. అంతర్జాతీయ మ్యాచుల్లో రెండు సార్లే ఓపెనింగ్ చేసినప్పటికీ ఐపీఎల్ లో ఓపెనర్ గా వచ్చిన అనుభవం ఉందని కోహ్లీ తెలిపాడు. 

  • Loading...

More Telugu News