: ఆమె వయస్సు 95 ఏళ్లు... ఎమ్మెల్యేగా పోటికి సై అంటోంది!


ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌రికొన్ని రోజుల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో, 95 ఏళ్ల‌ ఓ బామ్మగారు మూడు చక్రాల కుర్చీలో మరొకరి సాయంతో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ ఆఫీసుకి వచ్చి నామినేషన్ వేసింది. ఖేరాఘర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నిల‌బ‌డ‌తాన‌ని చెప్పింది. ఈ బామ్మ పేరు జల్‌దేవీ. ఆమె నామినేష‌న్ వేయ‌డానికి రావ‌డాన్ని చూసిన అధికారులు మొద‌ట‌ ఆశ్చర్యపోయారు. ఈ రోజు దేశ వ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆమె గొప్ప స్ఫూర్తిని చూపింద‌ని స్థానికులు ప్ర‌శంసించారు. జ‌ల్‌దేవీ 2015లో త‌మ ప్రాంతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బోర్డు సభ్యురాలిగా ఎన్నిక‌యింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తోంది.

  • Loading...

More Telugu News