: ఈసారి చంద్రబాబునే టార్గెట్ చేసిన పవన్... సహకరించడం కుదరకుంటే వెనక్కు మాత్రం లాగొద్దని హితవు!
రేపు తలపెట్టిన నిరసన ర్యాలీలను అడ్డుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు సర్కార్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ చేసుకుని పెట్టిన ట్వీట్ శరవేగంగా వైరల్ అయింది. ప్రత్యేక హోదాకు, జల్లికట్టు ఉద్యమానికి సంబంధం ఏంటని ప్రశ్నించిన చంద్రబాబుకు, పవన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. జల్లికట్టు స్ఫూర్తితో యువత ముందుకు వస్తున్నప్పుడు కుదిరితే యువతకు సహకరించాలని పవన్ కోరారు. అంతేకానీ, వెనక్కిలాగే వ్యాఖ్యలు చేయకండని హితవు పలికారు. ఈ ఉదయం నుంచి పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పలు ట్వీట్లు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. రేపు వివిధ ప్రాంతాల్లో యువత చేపట్టే శాంతియుత ర్యాలీలకు జనసేన మద్దతిస్తుందని ఇప్పటికే పవన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.