: ఆగస్టులో వైకాపా ఎంపీలంతా రాజీనామా చేస్తారు!: జగన్ సంచలన నిర్ణయం


ఈ సంవత్సరం ఆగస్టులో వైకాపా ఎంపీలంతా రాజీనామా చేయనున్నారని వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి మూడేళ్ల సమయం ఇవ్వాలని తాము ముందుగానే నిర్ణయించామని, మూడేళ్లు పూర్తయ్యే వరకూ వేచి చూస్తామని, ఈ కాలపరిమితి మరో నాలుగు నెలల్లో ముగుస్తుందని, ఈలోగా హోదాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి హోదా కోసం బడ్జెట్ సమావేశాల్లో ఒత్తిడి తెస్తామని, ఆపై వర్షాకాల సమావేశాల్లో బిల్లు తేకుంటే, రాజీనామా చేసి ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

తమతో పాటు తెలుగుదేశం ఎంపీలూ రాజీనామా చేయాలని కోరారు. చంద్రబాబు సహకరిస్తే, ఆనందిస్తామని, సంతోషపడతామని అన్నారు. ఒకవేళ ఆయన తోడుగా రాకున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుందని, ఆపై దేవుడు, ప్రజలు తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలుపుతారని అన్నారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా జరిగే క్యాండిల్ ర్యాలీలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News