: కేసీఆర్ పేరెత్తకుండా... నీరెత్తుకుపోతున్నారని జగన్ విమర్శ!


గోదావరి, కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ కు రానీయకుండా ఎగువన ఉన్న రాష్ట్రాలు పంపులు పెట్టి తోడుకుని తీసుకుపోతుంటే అడ్డుకోవాల్సిన చంద్రబాబు, కేసులకు భయపడి మిన్నకున్నారని వైకాపా అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. "చంద్రబాబు తాను చేయాల్సిన ప్రయత్నం ఒక్కటీ చేయట్లేదు. తాకట్టు పెట్టాడు ఆంధ్రరాష్ట్రాన్ని. నీళ్ల విషయంగా, ఎగువ రాష్ట్రం ఎడాపెడా గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లను మన రాష్ట్రంలోకి రాకమునుపే, అట్నుంచీ అటే పంపులు పెట్టి లిఫ్ట్ చేసుకుని తీసుకుపోతావుంటే, గట్టిగా నిలదీయాల్సింది పోయి అక్కడా మన రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి నీళ్లు రాకపోయినా ఫర్వాలేదన్న పరిస్థితిని తెచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఈ వ్యక్తి తాను ఏదైతే చెప్పాడో అది చెయ్యకపోగా, బాధ్యతగల స్థానంలో ఉండి, యువత పోరాటాలను సైతం తన స్వార్థ, వ్యక్తిగత ప్రయోజనాలకు తాకట్టు పెడుతున్న పరిస్థితి ఉంది" అని అన్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ పేరెత్తకుండా జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News