attack: విడాకుల కేసు దాఖలు చేయడానికి వచ్చి, ఫొటో జర్నలిస్టుపై దాడికి దిగిన బాలీవుడ్ హీరో!


బాలీవుడ్‌ హీరో పులకిత్‌ సామ్రాట్ ఓ ఫొటో జ‌ర్నిలిస్టుపై దాడికి దిగి తీవ్ర అస‌హ‌నాన్ని ప్ర‌ద‌ర్శించాడు. త‌న భార్య‌తో తలెత్తిన‌ విబేధాల కారణంగా కొంతకాలంగా ఆమెకు విడాకులు ఇవ్వ‌డానికి న్యాయ‌స్థానానికి వ‌చ్చిన ఈ హీరో ఇలా ప్ర‌వ‌ర్తించాడు. పులకిత్‌, అతని భార్య శ్వేత రోహిరా నిన్న వేర్వేరుగా విడాకుల కేసు దాఖలు చేయడానికి ముంబయ్ లోని బంద్రా ఫ్యామిలీ కోర్టుకు వచ్చారు. వీరిద్ద‌రూ కోర్టులో త‌మ వాదనలు వినిపించి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఫొటోగ్రాఫర్లు ఆయ‌న ఫొటో తీస్తుండ‌డాన్ని గ‌మ‌నించిన స‌ద‌రు హీరో ఓ ఫొటోగ్రాఫర్ కాల‌ర్‌ పట్టుకొని మరీ దాడికి దిగాడు.

  • Loading...

More Telugu News