: ఆ నిర్ణయంతో లాభమేంటి?: నోట్లరద్దుపై ప్రధానిని తొలిసారి ప్రశ్నించిన నితీశ్ కుమార్


పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత, మోదీ నిర్ణయాన్ని బహిరంగంగా సమర్థించిన ప్రధాన నాయకుల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఒకరన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆయన తొలిసారిగా నోట్ల రద్దు వ్యవహారంపై కేంద్రంపై విరుచుకుపడ్డారు. ప్రధాని 50 రోజుల గడువు మాత్రమే కోరారని గుర్తు చేస్తూ, ఇప్పటికే 77 రోజులు గడిచాయని, నోట్ల రద్దు వల్ల కలిగిన లాభాలను గురించి ప్రజలకు ఆయన వివరించాలని డిమాండ్ చేశారు.

బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, బ్యాంకులకు తిరిగొచ్చిన డబ్బులో నల్లధనం ఎంతుందో చెప్పాలని కోరారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు తరువాత ఉపాధి పనులు కరవై ఇబ్బందులు పడుతున్న కార్మికులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దుకు తాము మద్దతిస్తామని చెబుతూనే, మోదీ నిర్ణయం అమలులో ఉన్న లోపాలను ఎత్తి చూపుతామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News