: మూసీవాగులో దిగబడిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు తప్పిన ముప్పు
యాదాద్రి-భువనగిరి జిల్లాలో పెను ప్రమాదం నుంచి ప్రయాణికులు బయటపడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు పోచంపల్లి మండలంలోని మక్త అనంతారం వద్ద ప్రమాదవశాత్తు మూసీ వాగులో దిగబడింది. అదృష్టవశాత్తు బస్సు తిరగబడకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అతికష్టం మీద బస్సు నుంచి దిగి తప్పించుకున్నారు. అదుపు తప్పిన బస్సు ముందు చక్రం వాగులో కూరుకుపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని ప్రయాణికులు చెబుతున్నారు. బస్సు బోల్తాపడి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని పేర్కొన్నారు.