: స్మార్ట్‌ఫోన్ కొంటే వెయ్యి రూపాయల రాయితీ.. మధ్యంతర నివేదికలో చంద్రబాబు కమిటీ సిఫారుసు
నగదు లావాదేవీలు జరిపేందుకు వీలుగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు వెయ్యి రూపాయల రాయితీ ఇవ్వాలని చంద్రబాబు కమిటీ కేంద్రానికి సూచించింది. నోట్ల రద్దుపై కేంద్రం నియమించిన చంద్రబాబు ఆధ్వర్యంలోని కమిటీ మంగళవారం కేంద్రానికి సమర్పించిన మధ్యంతర నివేదికలో పై ప్రతిపాదన చేసింది. నగదు లావాదేవీల కంటే డిజిటల్ లావాదేవీలు సులభంగా, చౌకగా ఉన్నప్పుడే ప్రజలు అటువైపు మళ్లుతారని కమిటీ అభిప్రాయపడింది. దేశంలో నగదు రహిత, డిజిటల్ లావాదేవీలపై విధిస్తున్న అన్ని పన్నులను ఎత్తివేయాలని సూచించింది. ఆదాయపు పన్ను పరిధిలో లేని ప్రజలు, చిరువ్యాపారులు స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా రూ. వెయ్యి రాయితీ ఇవ్వాలని ప్రతిపాదించింది.