: మేము ముద్దాయిలమే అయితే అరెస్టు చేయండి...ఈ హౌస్ అరెస్టులెందుకు?: ముద్రగడ


కాపు రిజర్వేషన్ సాధనకు తలపెట్టిన సత్యాగ్రహ పాదయాత్రను పోలీసులు రెండోసారి అడ్డుకున్నారని కాపు రిజర్వేషన్ సాధన నేత ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో హౌస్ అరెస్టుపై ఆయన మాట్లాడుతూ, తాము ముద్దాయిలమైతే తమను అరెస్టు చేసి జైల్లో పెట్టాలని సూచించారు. రావులపాలెం వెళ్తుండగా తనను అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు. తమ జాతి కోసం తాను పోరాడుతున్నానని ఆయన అన్నారు. తమ జాతిని నమ్మించి, పీఠమెక్కిన తరువాత పాలకులు దానిని మర్చిపోయారని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని సత్యాగ్రహ పాదయాత్ర ద్వారా సాధించుకోవాలని ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. కాపు జాతిని ఉక్కుపాదాలతో అణిచివేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాపు జాతి అంటే చులకన అయిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వారు కోరుకుంటున్నట్టు సత్యాగ్రహ పాదయాత్రను రద్దు చేసుకోలేదని, కేవలం వాయిదా మాత్రమే వేశామని, తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన తెలిపారు. తనకు స్వేచ్ఛ లభించిన తరువాత మాట్లాడుతానని, అంత వరకు మౌన దీక్ష చేపడతానని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News