: 'ట్రంప్ మంచోడు' అన్నందుకు రూమ్మేట్ చెవి కొరికేసిన మెక్సికన్!


అమెరికా ప్రజలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకూల, ప్రతికూల వర్గాలుగా విడిపోయారు. దీంతో ట్రంప్ కు మద్దతిచ్చిన ఓ యువకుడు చెవి కోల్పోయిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పిట్స్‌ బర్గ్‌ లోని ఈస్ట్‌ లైబ్రరీ వైపు వుండే ఓ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఉన్న నివాసంలో ఇద్దరు వ్యక్తులు నివాసం ఉంటున్నారు. వారిలో ఒకతను మెక్సికన్... మెక్సికన్లు డ్రగ్ పెడలర్స్ అని, వారి వల్లే అమెరికా మాదకద్రవ్యాలకు అలవాటు పడుతోందని, మెక్సికోతో ఉన్న సరిహద్దుల్లో గోడకట్టేస్తానని ట్రంప్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెక్సికన్ యువకుడు ట్రంప్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఈ క్రమంలో నేడు తెల్లవారుజాము 6:45 నిమిషాలకు తన రూమ్ మేట్ తో ట్రంప్ గురించి చర్చించడం మొదలుపెట్టాడు.

 అయితే మెక్సికన్ వాదనతో అతని స్నేహితుడు (30) ఏకీభవించలేదు. పైగా ట్రంప్ కు మద్దతిచ్చాడు. అంతే, ఆ మెక్సికన్ కు తిక్కరేగింది. వెంటనే స్నేహితుడిపై దాడికి దిగాడు. అతని చెవి కొరికేశాడు. చేతి వేళ్లు మెలితిప్పేశాడు. కాలివేళ్లు చితక్కొట్టేశాడు. దీంతో బెంబేలెత్తిపోయిన బాధితుడు దగ్గరల్లో ఉన్న పెట్రోల్ బంక్ కు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నాడు. బంక్ లోని వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతనిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం రూంలో బాధితుడి చెవి భాగాన్ని స్వాధీనం చేసుకుని వైద్యులకు ఇవ్వడంతో వారు అతికించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉండగా, నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

  • Loading...

More Telugu News