: రాజకీయాల్లోకి వచ్చిన నటి రిమీ సేన్!


టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సరసన 'అందరివాడు' సినిమాలో నటించిన హీరోయిన్ రిమీ సేన్ రాజకీయరంగ ప్రవేశం చేసింది. బాలీవుడ్‌ లో 'ధూమ్' సినిమాలో అభిషేక్ బచ్చన్ సరసన నటించి అలరించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా బీజేపీలో చేరింది. ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకుంది. ఆమెను త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల ప్రచారంలో వినియోగించుకుంటామని ఆయన తెలిపారు.

 రిమీ సేన్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చానని తెలిపింది. తనకు ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పింది. కాగా, సినిమాల్లో కంటే 2015 లో రియాల్టీ షో బిగ్ బాస్-9 లో పాల్గొనడం ద్వారా మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించుకుంది. 

  • Loading...

More Telugu News