: కిర్లంపూడిలో ముద్రగడ హౌస్ అరెస్టు
కాపు రిజర్వేషన్ సాధన ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను ఆంధ్రప్రదేశ్ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలోనే ఆయనను హౌస్ అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అలాగే కాపు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న ఉద్యమ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారిని ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నామని ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. కాగా, పోలీసుల తీరుతో విసిగిపోయిన ముద్రగడ తన నివాసం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు.