: కారులో ఇంటికి వెళ్లేందుకు భయపడ్డ అశ్విన్!
టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు టీ20 సిరీస్ లో విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అశ్విన్ ఇంటికి బయల్దేరాడు. చెన్నైలోని విమానాశ్రయంలో దిగిన అశ్విన్ కారులో వెళ్తే జల్లికట్టు ఆందోళనకారులు అడ్డుకునే ప్రమాదం ఉందని ఎయిర్ పోర్టు పోలీసులు హెచ్చరించడంతో మెట్రో రైలులో ఇంటికి వెళ్లాడు. మాంబళంలో నివాసముండే అశ్విన్ మెట్రో రైలు ఎక్కిన దగ్గర్నుంచి అతనితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అశోక్ నగర్ లో అశ్విన్ ట్రైన్ దిగేంతవరకు అభిమానులు సెల్ఫీలు దిగడం విశేషం. కాగా, వారందరికీ అశ్విన్ ఓపిగ్గా సెల్ఫీ పోజులిచ్చాడు. ఈ సందర్భంగా విమానాశ్రయ పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు.