: రైల్లో సన్నీ లియోన్ ను చూసి రెచ్చిపోయిన అభిమానులు!
రైల్లో ఉన్న బాలీవుడ్ శృంగార నటి సన్నీ లియోన్ ను చూసి ఆమె అభిమానులు రెచ్చిపోయారు. ఆమె కూర్చున్న బోగీని వందల మంది చుట్టుముట్టారు. కిటికీపై కొడుతూ, చప్పుడు చేశారు. అభిమానుల తొక్కిసలాటను చూసిన సన్నీ నిశ్చేష్టురాలైంది. ఆ తర్వాత విండో కర్టెన్ మూసేసింది. అయినా సరే ఆగని అభిమానులు కిటికీని కొడుతూనే ఉన్నారు. గుజరాత్ లోని వడోదర స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
షారుఖ్ సినిమా 'రయీస్' ప్రమోషన్ లో భాగంగా సెంట్రల్ ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే అగస్ట్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో షారుఖ్, సన్నీలతో పాటు చిత్ర యూనిట్ బయలుదేరారు. రైలు ఎక్కే సమయంలో సన్నీ లియోన్ బుర్కా ధరించి ఎక్కింది. ఇంజిన్ మార్పిడి కోసం గుజరాత్ లోని వడోదరలో రైలును కాసేపు ఆపారు. అప్పటికే పలు మాధ్యమాల ద్వారా వీరంతా రైలులో వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు, భారీ సంఖ్యలో స్టేషన్ కు చేరుకున్నారు. మరోవైపు షారుఖ్ ఖాన్ ది కూడా ఇదే పరిస్థితి. చివరకు, పోలీసులు రంగ్ర ప్రవేశం చేసి, లాఠీ ఛార్జ్ చేశారు.