: మాకు గాయాలిచ్చినా, నీకు పువ్వులిస్తున్నాం.. ఓటు అనే బోటు మీద సముద్రం దాటావ్: పవన్ కల్యాణ్


కాసేపటి క్రితం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. తన మనసులోని ఆవేదనను వ్యక్తీకరిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ నమ్మబలికి, అధికారంలోకి వచ్చిన నేతలపై ఆయన తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడుతున్నారు. "మేము పూల గుత్తులు వేలాడే వసంత రుతువులం కాదు, వట్టి మనుషులం. దేశం మాకు గాయాలిచ్చినా, నీకు మాత్రం మేము పువ్వులనే ఇస్తున్నాం. ఓ ఆశా చంద్రికల కుంభవృష్టి కురిసే మిత్రమా, యోచించు, ఏమి తెస్తావో మా అందరి కోసం. ఓటు అనే బోటు మీద ఒక సముద్రం దాటావు", అంటూ వ్యాఖ్యానించారు. చట్టం చేసే నేతలకు గర్తు చేస్తున్నామంటూ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News