: నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో.. ద్రోహిగా మిగలకు!: పవన్ కల్యాణ్


భవిష్యత్ తరాల గొప్ప జీవితం కోసం ఎంతో మంది తమ జీవితాలను త్యాగం చేశారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్వేగభరితమైన కామెంట్ చేశారు. ఈ ఉదయం 9.40 గంటలకు ఆయన తన మనసులోని మాటను ట్వీట్ ద్వారా వెల్లడించారు. "నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యాన్ని చల్లలేకపోతే, అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించలేకపోతే, నీవు బానిసగానే ఉండిపోవడానికే నిర్ణయించుకుంటే... ఆ పవిత్ర రక్తానికి నీవు ఎంత ద్రోహిగా మారావో తెలుసుకో", అంటూ ఆయన స్పందించారు.  

  • Loading...

More Telugu News