: ట్రంప్ కు ఖరీదైన కార్లు అంటే మహా ఇష్టమట!
అమెరికా 45వ అధ్యక్షుడుగా గద్దెనెక్కిన డొనాల్డ్ ట్రంప్ కు కార్లు అంటే మహా పిచ్చి. ముఖ్యంగా ఖరీదైన కార్లు అంటే మరీనూ. ఇందుకు నిదర్శనం ఆయన వద్ద ఉన్న విలాసవంతమైన, ఖరీదైన కార్లే!
ఇంతకీ ట్రంప్ దగ్దర ఉన్న కార్లు ఏంటంటే...
* లాంబోర్ఘిని డయాబ్లో... ఇటాలియన్ సూపర్ స్పోర్ట్స్ కారు ఇది. 1997లో దీనిని కొనుగోలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకుబోయే ఈ కారు గంటకు 325 కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణిస్తుంది.
* రోల్స్-రాయిస్ సిల్వర్ క్లౌడ్.. 1956లోనే ఈ కారును ట్రంప్ కొనుగోలు చేశారట. కొన్ని కార్యక్రమాలకు ఈ కారులోనే ఆయన వెళుతుండేవారట. ఈ కారు స్పీడ్ గంటకు 165 కిలోమీటర్లు.
* 2003 మెర్సిడెస్-బెంజ్ ఎస్ఎల్ ఆర్ మెక్ లారెన్.. చాలా ఖరీదైన ఈ కారును 2005లో ట్రంప్ కొనుగోలు చేశారట. ఈ కారంటే ట్రంప్ కు చాలా ఇష్టమని అంటుంటారు. ఈ కారులే కాకుండా రోల్స్ రాయస్ ఫాంటమ్, బ్రాండెడ్ కార్లు ఎక్కుగానే ఆయన వద్ద ఉన్నాయట.