: ఐపీఎల్ ఆడితే ఛాంపియన్స్ ట్రోపీ గెలుస్తాం: కోహ్లీ
ఐపీఎల్ ఆడితే చాంపియన్స్ ట్రోఫీలో విజయం మనదేనని టీమిండియా కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. వన్డే స్లాగ్ ఓవర్లలో ఆటతీరు టీ20లను పోలి ఉంటుందని తెలిపాడు. స్లాగ్ ఓవర్లలో ఒత్తిడికి లోనుకాకుండా ఏ జట్టయితే పరుగులు సాధించగలుగుతుందో ఆ జట్టుకు విజయావకాశాలు మెరుగవుతాయని కోహ్లీ తెలిపాడు. స్లాగ్ ఓవర్లలో ఎలా ఆడాలో అలా టీ20ల్లో తొలి ఓవర్ నుంచే ఆడాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో స్లాగ్ ఓవర్ల ఒత్తిడి ఆటగాళ్లపై పని చేయదని తెలిపాడు. అందుకే ఐపీఎల్ లో ఆడడం ద్వారా చాంపియన్స్ ట్రోఫీకి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యే అవకాశం ఉందని తెలిపాడు. ఏప్రిల్ 3 నుంచి మే 26 వరకు ఐపీఎల్ సీజన్-10 జరగనుంది. అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టు విజయం సాధిస్తుందని కోహ్లీ విశ్వాసం వ్యక్తం చేశాడు.