: కపిల్ శర్మ ను ఆశ్చర్యపరిచిన గెస్టు...కపిల్ షో లో ఊహించని అతిథి


ప్రముఖ హిందీ టీవీ స్టార్ కపిల్ శర్మ షోలో ఊహించని అతిథి పాల్గొననున్నారు. 'కామెడీ నైట్స్ విత్ కపిల్ షో' ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల మనసులు గెలుచుకున్న కపిల్ శర్మ, 'కలర్స్' టీవీ ఛానెల్ తో కాంట్రాక్టర్ రద్దు చేసుకుని 'సోనీ'లో 'కపిల్ శర్మ షో' పేరుతో అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, బాలీవుడ్ సినీ నటులు, సంగీతకారులను ఆహ్వానించి, వారి సినిమాలకు ప్రచారం చేసే కపిల్ తాజాగా ఒక అంతర్జాతీయ సినిమాకు ప్రచారం చేయనున్నాడు.

ఈ విషయాన్ని సూచిస్తూ...తనషోకు ప్రపంచ ప్రఖ్యాత నటుడు జాకీచాన్ గెస్టుగా రానున్నారని ట్వీట్ చేశాడు. ఇది సినీ ప్రేమికులను అలరిస్తోంది. హాలీవుడ్ యాక్షన్ కామెడీ సినిమాల ద్వారా విశేషమైన ఆదరణ సంపాదించుకున్న జాకీచాన్ కు పిల్లాపెద్ద అని తేడా లేకుండా అభిమానులున్నారు. కపిల్ శర్మ ట్వీట్ తో భారత్ లోని జాకీ చాన్ అభిమానులు మురిసిపోతున్నారు. కాగా, 'కుంగ్ ఫూ యోగా' సినిమాలో జాకీచాన్ తో పాటు సోనూ సూద్, కైరా అద్వానీ, దిశాపటానీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News