: ఒబామా నా కోసం అందమైన లేఖను ఉంచారు...మీడియాకు కూడా చూపించను: ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన కోసం అందమైన లేఖను ఉంచారని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం పాలన వర్గానికి ట్రీట్ ఇచ్చిన ట్రంప్ వారితో మాట్లాడుతూ, ఒబామా వదిలి వెళ్లిన లేఖను చూపించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన ఆయన, ఈ అద్భుతమైన లేఖను చిరకాలం జాగ్రత్తగా దాచుకుంటానని చెప్పారు. అందులోని అంశాలను మనసులో ఉంచుకుని గౌరవిస్తానని చెప్పారు. ఈ లేఖలోని అంశాలను మీడియాకు కూడా చెప్పనని ఆయన తెలిపారు. అనంతరం ఆ లేఖను తన కోటు జేబులో భద్రంగా దాచుకున్నారు. కాగా, ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ గతంలో అమెరికా అధ్యక్షులుగా పని చేసిన అందర్లోనూ ఒబామా పనికిమాలిన వ్యక్తి అని మండిపడ్డ సంగతి తెలిసిందే.