: నైట్ క్లబ్ లో స్టెప్పులేస్తూ అడ్డంగా బుక్కయిన ముషారఫ్!
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అడ్డంగా బుక్కయ్యారు. గుర్తు తెలియని మహిళతో ఓ నైట్ క్లబ్బులో ముషారఫ్ స్టెప్పులేశారు. బాలీవుడ్ సినిమా 'యే జవానీ హై దీవానీ'లోని పాటకు మహిళతో కలసి వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాక్ లో అత్యంత ప్రజాదరణ పొందిన ఓ టెలివిజన్ టాక్ షో వ్యాఖ్యాత అయిన హమిద్ మిర్ ఈ డ్యాన్స్ వీడియోను ట్విట్టర్ లో అప్ లోడ్ చేశాడు. హమిద్ మిర్ గత ఏడాది కూడా ఓ వీడియోను అప్ లోడ్ చేశాడు. అందులో తన భార్య సెహ్ బా తో కలసి ముషారఫ్ స్టెప్పులేశాడు. రాజద్రోహం కేసును ఎదుర్కొంటున్న ముషారఫ్ పేరును 'ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్' నుంచి గత ఏడాది మార్చ్ లో ప్రభుత్వం తొలగించింది. దీంతో, చికిత్స నిమిత్తం ఆయన దుబాయ్ వెళ్లారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నాడు.