budjet: బ‌డ్జెట్‌కు సుప్రీంకోర్టు పచ్చజెండా.. కేంద్ర సర్కారుకి తొలగిన అడ్డంకులు


వ‌చ్చేనెల‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో వ‌చ్చేనెల 1న కేంద్ర ప్ర‌భుత్వం వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడితే అది ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేసే విధంగా ఉంటుందంటూ సుప్రీంకోర్టులో ఇటీవ‌లే పిటిష‌న్ దాఖ‌లైన విష‌యం తెలిసిందే. బడ్జెట్‌ సమర్పణను వాయిదా వేయాలని కోరుతూ ఎం.ఎల్‌.శర్మ అనే న్యాయ‌వాది వేసిన‌ ఈ వ్యాజ్యంను సుప్రీంకోర్టు ఈ రోజు కొట్టివేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణ‌యించినట్టుగా ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి మార్గం సుగ‌మ‌మైంది. ఈసారి నుంచి రైల్వే బ‌డ్జెట్ ప్ర‌త్యేకంగా లేక‌పోవ‌డంతో దాని నిధుల‌ కేటాయింపులు కూడా సాధార‌ణ బ‌డ్జెట్‌లోనే వుంటాయి.

  • Loading...

More Telugu News