: సెహ్వాగ్ కు మరిన్ని బాధ్యతలు అప్పగించిన పంజాబ్ జట్టు


టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు కింగ్ ఎలెవన్ పంజాబ్ జట్టు మరిన్ని బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే ఆ జట్టు మెంటార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీరూ భుజాలపై మరిన్ని బాధ్యతలు మోపింది. మెంటార్ గా ఉంటూనే జట్టు ఆపరేషన్స్, స్ట్రాటజీ చీఫ్ గా ఉండనున్నారు. అలాగే పంజాబ్ జట్టు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా సెహ్వాగ్ వ్యవహరించనున్నాడని పంజాబ్ ఫ్రాంఛైజీ ప్రకటించింది. ఈ సందర్భంగా సెహ్వాగ్ అనుభవం, సామర్థ్యం జట్టుకు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నామని పేర్కొంది. కొత్త పాత్రలో సెహ్వాగ్ రాణిస్తాడని ఆశిస్తున్నామని యాజమాన్యం ఆకాంక్షించింది. దీనిపై సెహ్వాగ్ స్పందిస్తూ, యువకుల్లో మెంటార్ గా స్పూర్తి రగిలిస్తూ, జట్టును నడిపించే అవకాశం లభించడం గొప్పవిషయమని, కొత్త బాధ్యతల్లో ఇమిడిపోతానని సెహ్వాగ్ ఆకాంక్షించాడు. 

  • Loading...

More Telugu News