: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటున్న తెలంగాణ హీరో!
కష్టాల్లో పలువురికి చేతనైన సహాయం చేస్తూ, అందరి మన్ననలు అందుకుంటున్న హీరో సంపూర్ణేష్ బాబు. తెలంగాణలోని సిద్ధిపేట సంపూర్ణేష్ జన్మస్థలం. అయినప్పటికీ... ఏపీకి ప్రత్యేక హోదా కావాల్సిందే అంటూ డిమాండ్ చేశాడు. అంతేకాదు ప్రత్యేక హోదాకు మద్దతుగా తన ఫేస్ బుక్ కవర్ ఫొటోను మార్చేశాడు. ఈ నెల 26న విశాఖలోని ఆర్కే బీచ్ లో తలపెట్టిన ప్రత్యేక హోదా సాధన దీక్షకు మద్దతు పలికాడు. మరో హీరో తనీష్ కూడా ప్రత్యేక హోదాకు మద్దతుగా నిలిచాడు. ప్రత్యేక హోదాకు సంపూ మద్దతు పలకడంతో... ఏపీ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంపూను చూసైనా ఇతర హీరోలు స్పందించాలని కోరుతున్నారు.