: ముఖానికి కర్చీఫ్ కట్టుకుని, నిరసనకారుల మధ్యే తెల్లవారేవరకు గడిపిన హీరో విజయ్!
కోలీవుడ్ లో రజనీకాంత్, కమలహాసన్ ల తర్వాత అంతటి క్రేజ్ ఉన్న హీరో విజయ్. జల్లికట్టును సాధించుకునే క్రమంలో తమిళ యువత చేపట్టిన ఆందోళనకు ఆయన బహిరంగంగా మద్దతిచ్చాడు. ఇప్పటిదాకా సోషల్ మీడియాలో స్పందించిన విజయ్... యువతతో కలసి ఆందోళనలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. అందుకే అర్ధరాత్ర దాటిన తర్వాత ముఖానికి కర్చీఫ్ కట్టుకుని... మెరీనా బీచ్ లో ఆందోళన చేస్తున్న నిరసనకారుల మధ్య కూర్చున్నాడు. తెల్లవారే దాక అక్కడే ఉండి, ఆ తర్వాత వెళ్లిపోయాడు. ముఖానికి మాస్క్ ఉండటంతో, విజయ్ ను ఎవరూ గుర్తించలేదు. ఎవరైనా గుర్తించి ఉంటే... అభిమానుల మధ్య నలిగిపోయేవాడు విజయ్.