pawan kalyan: చూస్తూ కూర్చోం.. మెడలు వంచి కూర్చోపెడ‌తాం: ప‌వ‌న్ క‌ల్యాణ్ ఘాటు విమర్శలు


‘గాంధీజీని ప్రేమిస్తాం.. అంబేద్కర్‌ను ఆరాధిస్తాం... సర్దార్ ప‌టేల్‌కి సెల్యూట్ చేస్తాం... భార‌త రాజ్యాంగాన్ని గౌర‌విస్తాం... కానీ త‌ల ఎగ‌రేసే ఉత్త‌రాది నాయ‌క‌త్వం ద‌క్షిణాది ఆత్మ‌గౌర‌వాన్ని కించ‌ప‌రుస్తూ ఉంటే మాత్రం చూస్తూ కోర్చోం.. మెడలు వంచి కూర్చోపెడ‌తాం' అంటూ సినీనటుడు, జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ రోజు ఆవేశంతో కూడిన ఓ ట్వీట్ చేశారు. ‘తిడితే భ‌రించాం.. విడ‌గొట్టి గెంటేస్తే స‌హించాం.. ఇచ్చిన మాట నిల‌బెట్టుకోక‌పోతే తిర‌గ‌బ‌డ‌తాం.. అన్న‌ది ఆంధ్ర‌యువ‌త.. ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వానికి తెలియ‌జెప్పాలి’ అని మ‌రో ట్వీట్ లో పేర్కొన్నారు.

తమిళుల జల్లికట్టు పోరాటం నేపథ్యంలో ఆంధ్రప్రజలు స్ఫూర్తిని పొందాలని, పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకోవాలని పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. విద్యార్థులు పోరాటం జరిపితే వారి వెనుక నేనుంటానని కూడా పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్ చేసిన ఈ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ వరుసగా ప్రతిరోజు ట్వీట్లు చేస్తూ సామాజిక అంశాలపై తన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారు.  

  • Loading...

More Telugu News