: అందుకే.. ఇండియాను ఓడించగలిగాం!: ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్


వన్డే సిరీస్ లో భారత ఆధిక్యాన్ని తమ స్ఫూర్తిదాయక ఆటతీరుతో 2-1కి తగ్గించి, తలెత్తుకు నిలిచిన ఇంగ్లండ్ జట్టు కెప్టెన్, మ్యాచ్ గెలిచిన పరిస్థితులను విశ్లేషించాడు. ఈడెన్ గార్డెన్స్ లో పిచ్, ఇంగ్లండ్ లో పిచ్ మాదిరిగానే ఉందని, అందువల్లే తాము విజయం సాధించామని చెప్పాడు. ఇక్కడి పిచ్ లు భారత ఆటగాళ్లకు అలవాటు కాబట్టి మిగతా మ్యాచ్ ల్లో వారు మెరుగ్గా రాణించారని, ఈడెన్ మాత్రం బ్రిటన్ పిచ్ లకు దగ్గరగా ఉందని తెలిపాడు. ఇటువంటి పిచ్ పై చాంపియన్స్ ట్రోఫీకి ముందు మ్యాచ్ ఆడి విజయం సాధించడం తమకు మంచి ప్రాక్టీసని తెలిపాడు. చివరి ఓవర్లో మూడు, నాలుగు బంతులు తమకు అత్యంత కీలకమైనవని, ఆ రెండు బంతులనూ పక్కాగా వేయడంతో విజయం వరించిందని చెప్పాడు. కాగా, గత రాత్రి జరిగిన పేటీఎం వన్డే సిరీస్ లో ఇంగ్లండ్ జట్టు భారత్ పై 5 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News