: కేసీఆర్ తక్షణమే రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలి.. తెలంగాణ లేబర్ పార్టీ డిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తక్షణం తన పదవికి రాజీనామా చేసి అన్నమాట ప్రకారం దళితుడిని సీఎంగా, బీసీని ఉప ముఖ్యమంత్రిగా చేయాలని తెలంగాణ లేబర్‌పార్టీ(టీఎల్పీ) డిమాండ్ చేసింది. హైదరాబాద్ ఎల్పీనగర్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రె రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో జరుగుతున్న అవినీతి, అవకతవకలపై పోరాడాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి దళితుడిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలన్నారు. మిషన్ కాకతీయకు సమ్మక్క, సారలమ్మ పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు.